APTF VIZAG: టీచర్ల మెడికల్ బిల్లులు పెండింగ్లో లేవు. పాఠశాల విద్యాశాఖ స్పష్టత

టీచర్ల మెడికల్ బిల్లులు పెండింగ్లో లేవు. పాఠశాల విద్యాశాఖ స్పష్టత

రాష్ట్రంలోని ఉపాధ్యాయుల మెడికల్ రీయింబర్స్ మెంట్ బిల్లులు పెండింగ్ లో లేవని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ స్పష్టం చేశారు. ఈ నెల 21న ఆంధ్రప్రభలో ప్రచురితమైన 11 నెలలుగా టీచర్ల మెడికల్ బిల్లులు  కథనంపై స్పందించిన విద్యాశాఖ కమిషనర్ సోమవారం వివరణ ఇచ్చారు. ఉపా ధ్యాయుల మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులకు సంబంధించి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో ఇప్పటికే ఆన్లైన్ శాంక్షన్ ఆర్డర్ ఆదేశాలిచ్చారని తెలిపా రు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి మెడికల్ బిల్లులు డీడీవోల ద్వారా వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు ఆన్లైన్లో పంపించడం జరగుతుందని శాంక్షన్ ఉత్త ర్వులు కూడా డీడీవోలకే పంపించడం జరుగుతుందన్నారు. శాంక్షన్ ప్రొసీడింగ్స్ జనరేట్ అయిన వెంటనే బిల్లులు మంజూరు అవుతాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు.

No comments:

Post a Comment