డిగ్రీ కోర్సుల్లో సీట్లు భారీగా మిగిలాయి. మొత్తం సీట్లలో సగం కూడా భర్తీ కాలేదు. మొత్తం 3,46,777 సీట్లకు 1,42,478 భర్తీ అయ్యాయి. ఏకంగా 2,04,299 సీట్లు ఖాళీగా మిగిలాయి. డిగ్రీ ప్రవేశాల కోసం చేపట్టిన కౌన్సెలింగ్ శనివారంతో ముగిసింది. మూడు దశల్లో నిర్వహించిన కౌన్సెలింగ్ 41% సీట్లు నిండాయి. తొలి విడతలో 84,549 సీట్లు, రెండోసారి 38,645, మూడో విడతలో 18,284 సీట్లు భర్తీ అయ్యాయి. ప్రభుత్వ కళాశాలల్లో 57,061 సీట్లు ఉండగా 26,227 మంది ప్రవేశాలు పొందారు. ప్రైవేటు ఎయిడెడ్ 23,939 సీట్లకు 7276, ప్రైవేటులో 2,62,970 సీట్లకు 1,06,650 మంది చేరారు. యూనివర్సిటీ కళాశాలల్లో 2,804 సీట్లకు 1,325 భర్తీ అయ్యాయి. డిగ్రీలో మొత్తం 22 కోర్సులు ఉండగా మూడు కోర్సుల్లో ఒక్క విద్యార్థి చేరలేదు. బీఎస్సీలో 62,429, బీకాంలో 51,395, బీఏలో 11,914, బీబీఏలో 5,585 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు.
No comments:
Post a Comment