APTF VIZAG: ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేదు.. వారిని ప్రతిపక్షం రెచ్చగొడుతోంది: సీఎం జగన్‌

ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేదు.. వారిని ప్రతిపక్షం రెచ్చగొడుతోంది: సీఎం జగన్‌

ఉపాధ్యాయులను రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని.. దానికి ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉండేలా విద్యా వ్యవస్థలో మార్పుల దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. పేదలు కూడా మంచి చదువులు చదవాలనేదే తమ లక్ష్యమని అన్నారు. విజయవాడలో ప్రభుత్వం నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 


ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమకు లేదని జగన్ అన్నారు. ఎవరూ అడగకుండానే ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచామని చెప్పారు. ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులను కల్పించామని తెలిపారు. విద్యాశాఖపైనే తాను ఎక్కువ సమీక్షలను నిర్వహించానని చెప్పారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర ఉపాధ్యాయులదేనని అన్నారు. సాన పట్టకపోతే వజ్రం కూడా రాయితోనే సమానమని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యా వ్యవస్థలో అనేక చర్యలను చేపట్టామని అన్నారు. నాణ్యమైన చదువులు అందరికీ అందుబాటులోకి రావాలని చెప్పారు. గత ప్రభుత్వం తీసుకున్న చర్యలు పేదలకు విద్యను దూరం చేశాయని అన్నారు

No comments:

Post a Comment