APTF VIZAG: సర్కారు నోట జీపీఎస్ మాటే. పాత పింఛన్ అమలుకు అంగీకరించని మంత్రులు బొత్స, బుగ్గన. జీపీఎస్పై చర్చలంటే పిలవొద్దన్న ఉద్యోగ సంఘాలు. మరోసారి 16 సంఘాలతో నేడు చర్చలు

సర్కారు నోట జీపీఎస్ మాటే. పాత పింఛన్ అమలుకు అంగీకరించని మంత్రులు బొత్స, బుగ్గన. జీపీఎస్పై చర్చలంటే పిలవొద్దన్న ఉద్యోగ సంఘాలు. మరోసారి 16 సంఘాలతో నేడు చర్చలు

 పాత పింఛన్ విధానం (ఓపీ ఎస్) అమలు చేస్తామంటేనే చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పాయి. గ్యారెంటీ పింఛన్ పథకం(జీపీఎస్)పై చర్చలంటే మరోసారి తమను పిల వొద్దని వెల్లడించాయి. విజయవాడలో మంగళవారం సీపీఎస్ ఉద్యోగుల సంఘం, సీపీఎస్ ఎంప్లాయిస్ అసో సియేషన్లతో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి చర్చలు జరిపారు. ఇందులో ఉద్యోగ సంఘాల నాయకులు ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేయగా.. మంత్రులు మాత్రం జీపీఎస్ పైనే చర్చించాలని పట్టుబట్టారు. దీంతో చర్చలు అసంపూర్తి గానే ముగిశాయి. జీపీఎస్ పైనే మాట్లాడాలని, కావా లంటే ఇందులోనే మెరుగైన విధానం అమలు చేస్తామని మంత్రులు చెబుతున్నారని ఉద్యోగ సంఘాల నాయ కులు వెల్లడించారు. ఓపీఎస్ అమలుపై అసలు మాట్లా డడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే మంత్రులు బొత్స బుగ్గన రెండు పర్యాయాలు ఉద్యోగ సంఘాల నాయకు లతో చర్చలు జరిపారు. ఈ రెండు విడతల్లోనూ జీపీ ఎస్ అమలునే ప్రస్తావించారు. అయితే సచివాలయంలో బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు మరోసారి చర్చించేందుకు 16 ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ చర్చల్లో మంత్రులు బొత్స సత్యనా రాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఆర్ధిక, జీఏడ్ అధికారులు పాల్గొంటారు. ఈ చర్చల్లో జీపీఎస్ అమ లుపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. జీపీఎస్ నే మెరుగైన విధానం కోసం సలహాలు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలను కోరాలని, వాటి ఆధారంగా జీపీఎస్ అమలుకు నిర్ణయం తీసుకో వాలని ప్రభుత్వం భావిస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు.

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4