ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘా ల నేతలపై పోలీసులు సాగిస్తున్న అణచివేతను మంత్రి బొత్స సత్యనారాయణ సమర్థించారు. ‘మిలిటెంట్ ఉద్యమకారులుగా గుర్తించిన వారినే ముందస్తు బైండోవర్ చేస్తున్నారు. దూకుడుగా ఉద్యమాల్లో పాల్గొనే వారిపైనే పోలీసులు నిఘాపెట్టారు. సీఎం ఇంటిని ముట్టడి చేస్తామంటే చూస్తూ ఊరుకోవాలా’ అని ప్రశ్నించారు. శనివారం విజయనగరంలో ఆయన మాట్లాడారు. మిలియన్ మార్చ్ గురించి తనకు తెలియదన్నారు. ‘‘సీపీఎస్ రద్దు చేస్తామని మేము హామీ ఇచ్చాం.. కాదనడం లేదు. కానీ, సీపీఎస్ రద్దుచేస్తే కొన్ని ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంది. దీన్నిదృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ స్కీమ్‌ను తీసుకుని వస్తున్నాం’’ అని అన్నారు. ‘ముఖ హాజరు’ విధానాన్ని తొలుత ఉపాధ్యాయులకు వర్తింపజేశామని, దశల వారీగా అన్ని శాఖలకు విస్తరిస్తామని మంత్రి తెలిపారు.
No comments:
Post a Comment