APTF VIZAG: విద్యా హక్కు చట్టం కింద ప్రవేశాలకు దరఖాస్తులు నేటి నుంచి ఆన్లైన్ లో సబ్మిట్ చేసుకోవచ్చు

విద్యా హక్కు చట్టం కింద ప్రవేశాలకు దరఖాస్తులు నేటి నుంచి ఆన్లైన్ లో సబ్మిట్ చేసుకోవచ్చు

విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఉచితంగా ప్రవేశాలు పొందేందుకు మంగళవారం నుంచి ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు 

http://sims.ap.gov.in/RTE/

 గ్రామీణ ప్రాంతాల్లో వార్షికాదాయం రూ .1.20 లక్షలు , పట్టణాల్లో రూ . 1.40 లక్షలు ఉన్న వారు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు .

అనాథ , హెచ్ ఐవీ బాధిత పిల్లలు , దివ్యాంగులకు 5 % , ఎస్సీలకు 10 % , ఎస్టీలకు 4 % , బీసీ , మైనారిటీ , ఓసీలకు 6 % సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు . 

ఈనెల 26 లోపు http://cse.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు .

No comments:

Post a Comment