APTF VIZAG: Learn a Word a day level 1,2,3,4 words List

Learn a Word a day level 1,2,3,4 words List

ఆగష్టు మాసానికి 1 నుండి 10 తరగతుల విద్యార్థులకు రోజుకో పదం నేర్చుకో తాజా షెడ్యూలు( స్థాయిల వారీగా పదాల జాబితా) విడుదల

1 నుండి 10 తరగతుల విద్యార్థులకు ఆంగ్ల భాష పదజాలం పై పట్టు సాధించడానికి అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమం "రోజుకో పదం నేర్చుకో".

Click Here To Download 

👉ఇందులో భాగంగా ఆగస్టు నెల కు 1 నుండి 31 వ తారీఖు వరకు 22 రోజుల పాటు వివిధ స్థాయిల ( లెవెల్ 1 నుండి 4 వరకు) విద్యార్థులకు నేర్పించాల్సిన పదాల జాబితా తో కూడిన షెడ్యూలు విడుదలైనది.

కార్యక్రమ అమలు తీరు:

👉ప్రతి రోజు షెడ్యూలు అనుసరించి ఒక ఆంగ్ల పదాన్ని పాఠ శాల అసెంబ్లీ లో పరిచయం చేయాలి.

👉మొదటి పీరియడ్ ఉపాధ్యాయుడు ఆ పదాన్ని, దాని అర్థాన్ని బోర్డ్ పై మూలలో వ్రాసి పిల్లలచేత పలికించాలి.

👉ఆంగ్ల ఉపాధ్యాయుడు తన పీరియడ్ నందు ఆ పదము యొక్క అర్థమును (రెండు భాషలలోను),పలుకు విధానమును,స్పెల్లింగ్,దాని భాషాభాగాలు( parts of speech), దాని యూసేజ్ ను వివరించాలి.విద్యార్థులచే డిక్షనరీలో ఆ పదాన్ని పెన్సిల్తో underline చేయించాలి.

👉విద్యార్థులు ఒక 100 పేజీల నోటు పుస్తకంలో పదం యొక్క వివరాలు రాసుకోవాలి. దీనిని "My Own Dictionary"  గా పిలుస్తారు.దీనిని ఉపాధ్యాయుడు తప్పకుండా తరచుగా చెక్ చేయాలి.

👉మిగిలిన పీరియడ్ల ఉపాధ్యాయులు కూడా పీరియడ్ ప్రారంభం లో 5 నిమిషాలు పదమును,అర్థమును పలికించాలి.

👉Learn a word a day programme నిర్వహణ ప్రతి ఉపాధ్యాయుని బాధ్యత.

👉ప్రతి ఉపాధ్యాయుడు తన పీరియడ్ లో వీలైనన్ని సార్లు , వీలైనన్ని సందర్భాలలో ఆ రోజుటి పదాన్ని ఉపయోగించాలి.

👉ప్రతి రోజూ, ఆ రోజు పదాన్ని పాఠ శాల వరండాలో, అసెంబ్లీలో బోర్డుపై ప్రదర్శించాలి.

👉ప్రతి 15 రోజులకు ఒక సారి అంతవరకు ఆ 15 రోజులలో నేర్చుకున్న పదాలపై Spell bee కాంపిటీషన్స్ నిర్వహించాలి.

👉తనిఖీ అధికారులు వచ్చినపుడు విద్యార్థుల నోటు పుస్తకాలు( పదాలు రాసుకున్నవి), డిక్షనరీ ఎంట్రీస్  తప్పక చూపాలి.

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4