APTF VIZAG: రేపటిలోగా విద్యార్థుల వివరాల నమోదు తప్పనిసరి

రేపటిలోగా విద్యార్థుల వివరాల నమోదు తప్పనిసరి

► ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలల్లోని 1,6వ తరగతి విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో ఈ నెల 31లోపు నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.

► ఈ మేరకు ఆగస్టు 1వ తేదీ నుంచి చైల్డన్ఇన్ఫో వెబ్సైట్లో విద్యార్థుల నమోదును నిలిపివేయనుంది.

► ఇందుకు సంబంధించిన ఆదేశాలను విద్యాశాఖ కమిషనరు ఎస్ సురేష్ కుమార్ అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకూ ఇటీవల జారీ చేశారు.

► ఈ నెల 31 వ తేదీ డేటా ఆధారంగానే భవిష్యత్తులో ఉపాధ్యాయుల బదిలీలు, రేషనలైజేషన్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

► ప్రభుత్వ పథకాల ( జెవికె, అమ్మఒడి, మధ్యాహ్న భోజనం ) లబ్ధి కూడా ఈ తేదీనే పరిగణనలోకి తీసుకుంటారు.

No comments:

Post a Comment