APTF VIZAG: ఐటీ రిటర్నుల గడువు పెంపునకు నో. గత మూడేళ్లలో ఇదే తొలిసారి

ఐటీ రిటర్నుల గడువు పెంపునకు నో. గత మూడేళ్లలో ఇదే తొలిసారి

 ఆదాయపన్ను చెల్లించే వ్యక్తులు , సంస్థలు రిటర్నులు దాఖలు చేయడానికి జులై 31 వ తేదీతో గడువు ముగియనుండగా పొడిగించేందుకు కేంద్రప్రభుత్వం సుముఖంగా లేదు . ఈ మేరకు స్పష్టమైన ప్రకటనలు కూడా చేసింది . గడువు పెంచకుండా ఉండటం గడచిన మూడేళ్లలో ఇదే తొలిసారి . జరీమానాలు పడకుండా ఉండాలంటే గడువులోగా పన్ను చెల్లింపుదారులు తమ ఐటీ రిట్నరులు దాఖలు చేయక తప్పదు . కోవిడ్ -19 మహమ్మారి కారణంగా గత రెండు ఆర్థిక సంవత్సరాలలో ఐటీ రిట్నరుల గడువును కేంద్రం పదేపదే పొడిగిస్తూ వచ్చింది . కానీ ప్రస్తుతం కోవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గిపోవడంతో గడువు పొడించాల్సిన అవసరం , ఆలోచన ఏదీ లేదని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ ఇప్పటికే ప్రకటించారు .

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today