APTF VIZAG: పాఠశాలల విలీనంపై జిల్లాల్లో ప్రత్యేక కమిటీలు.పునరాలోచనలో ప్రభుత్వం

పాఠశాలల విలీనంపై జిల్లాల్లో ప్రత్యేక కమిటీలు.పునరాలోచనలో ప్రభుత్వం

 ప్రభుత్వ పాఠశాలల విలీనంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుం డడంతో మరోసారి పరిశీలనకు జిల్లాల్లో కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన రహదారులు, రైల్వే క్రాసిం గ్లు, వాగులు, వంకలు దాటి వెళ్లాల్సి వస్తున్న వాటిని పరిశీలించాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఇందు కోసం మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. పాఠశాలల విలీనాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించ డంతోపాటు ఇటీవల 70మంది ఎమ్మెల్యేలు విలీనం నిలి పివేయాలంటూ మంత్రి బొత్స సత్యనారాయణకు లేఖలు రాశారు. జిల్లా కలెక్టర్లకు ఎమ్మెల్యేలు వినతులు సమర్పిం చారు. ఈ నేపథ్యంలో విలీనంపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. దీంతో కలెక్టర్ల ద్వారా ప్రత్యేకంగా పరిశీలన చేపట్టారు. కడప జిల్లాలో మండల స్థాయిలో ఎంపీ డీవో, ఎమ్మార్వో, సర్వేయర్, ఎంఈవోలతో కమిటీని ఏర్పాటు చేశారు. నంద్యాలలోనూ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ప్రాథమిక పాఠశాలల నుంచి 3,4,5 తర గతులను కిలోమీటరు దూరంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తుండగా.. ప్రాథమికోన్నత బడుల నుంచి 6,7,8 తరగతులను ఉన్నత బడుల్లో కలిపేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,250 పాఠశాలలను విలీనం చేస్తుం డగా.. వీటిల్లో 270 పాఠశాలల్లో వాగులు, వంకలు, రహ దారులను దాటి వెళ్లాల్సి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కానీ క్షేత్రస్థాయిలో కిలోమీటరు కంటే దూరంలోని ప్రాథమిక బడుల నుంచి 3,4,5 తరగతులను విలీనం చేస్తున్నారు. వాగులు, వంకలు, రహదారులను పట్టించు కోవడం లేదు. పాఠశాలల తరలింపు, వాగులు, వంకలు, రహదారులు దాటి బడికి వెళ్లాల్సి రావడాన్ని తల్లిదం డ్రులు, గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today