పాఠశాలల విలీనంపై ప్రభుత్వం వెనక్కి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రక్రియలో పాఠశాల విద్యాశాఖ అధికారుల వైఖరి ఒకలా ఉంటే, మంత్రి బొత్స సత్యనారాయణ మరోలా స్పందిస్తున్నారు. పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళ నలు చేస్తుండగా.. ఉన్నతాధికారులు మాత్రం క్షేత్రస్థాయి అధికారుల పై ఒత్తిడి చేసి, ఈ ప్రక్రి యను పూర్తి చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు విలీన ప్రక్రియలో సమస్యలు ఉంటే తెలియజేయాలంటూ ఎమ్మెల్యేలకు మంత్రి బొత్స లేఖలు రాయడం విద్యాశాఖలో చర్చనీయాంశంగామారింది. పాఠశాలల హేతుబద్ధీకరణ ప్రక్రియలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఈనెల 18న అసెంబ్లీకి వస్తున్నం దున వాటిని లిఖిత పూర్వకంగా తెలియచేయా లని లేఖలో పేర్కొన్నారు. విద్యార్థులకు వెసులు బాటు ఉండేలా పాఠశాలల హేతుబద్ధీకరణకు కిలోమీటరు పరిధిని నిర్ణయించామని, విలీన పాఠ శాలకు వెళ్లేందుకు రహదారులు, వాగులు, వంక లను దాటాల్సి రావడంలాంటి పరిస్థితులు ఎక్క డైనా దృష్టికి వస్తే వాటిని సరిదిద్దే చర్యల్లో భాగ స్వాములు కావాలని ఎమ్మెల్యేలకు సూచించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అభివృద్ధి సీఎం జగన్ ఆశయమని, అందరికి విద్యా హక్కు- జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా పలు సంస్కరణ లకు విద్యాశాఖ శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.
No comments:
Post a Comment