SCERT డైరెక్టర్ శ్రీ B ప్రతాపరెడ్డి గారిని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలసి ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇప్పించే ప్రక్రియ త్వరిత గతిన ప్రారంభం అయ్యేలా కృషి చేయాలని కోరడం జరిగింది. అందులకు వారు స్పందిస్తూ, జిల్లా పరిషత్ పాఠశాల లోనే జూనియర్ కాలేజీలు ప్రారంభం కానున్నాయని, స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్లుగా ప్రధానోపాధ్యాయులకు ప్రిన్సిపాల్ హోదా, SGT లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు త్వరలో రావడం ఖాయమని తెలిపారు.
ఒక కిలోమీటరు పరిధిలోని పాఠశాలలు విలీన ప్రక్రియ అయ్యిన వెంటనే పదోన్నతుల ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది అని తెలిపారు.
అదేవిధంగా ఉపాధ్యాయ బదిలీలు కూడా పాఠశాలల సెలవులు ముగిసే లోపే పూర్తి అవుతాయని తెలియపరిచారు.
No comments:
Post a Comment