మొదట అమ్మఒడి అనర్హత జాబితాలో ఉంటే... మీరు ఏ కారణం చేత పథకాన్ని నిలిపేశారో ముందు తెలుసుకోవాల్సి ఉంటుంది.
విద్యుత్ వినియోగం 300 యూనిట్ల దాటితే అనర్హులవుతారు.
ఐతే మీరు అద్దె ఇంట్లో ఉంటూ.. ఆధార్ ఆధారంగా 300 యూనిట్ల వినియోగం మించినట్లు గుర్తిస్తే.. వెంటనే విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్లి.. ఆధార్ కార్డు, మీటర్ నెంబర్ తో పాటు గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఎల్ఈడీ బల్బులు తీసుకున్న ఆధారాలు చూపించాలి.
అలా అయితే మీకు, ఆ విద్యుత్ మీటర్ కు సంబంధం లేదంటూ ఓ సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారు. దాన్ని గ్రామ, వార్డు సచివాలయంలో ఇచ్చి వివరాలను అప్ డేట్ చేయించుకోవాలి.
రేషన్ కార్డులో ఉన్న వ్యక్తుల పేరు మీద పట్టణాలలో ఐతే వెయ్యి చదరపు అడుగుల నివాసస్థలం, గ్రామాల్లో 700 చదరపు అడుగులు నివాసస్థలం ఉంటే అమ్మఒడికి అనర్హులు. విద్యార్థి కుటుంబ సభ్యులంతా ఒకే రేషన్ కార్డులో ఉండి వారిలో ఎవరి పేరుమీదైనా అర్హతకు మించిన స్థలముంటే అమ్మఒడి రాదు.
విద్యార్థి తాత,నానమ్మల పేరుతో ఆ స్థలముంటే వెంటనే తల్లిదండ్రులు మ్యారేజ్ సర్టిఫికెట్ చూపించి రేషన్ కార్డులో సపరేట్ అవ్వాల్సి ఉంటుంది.
విద్యార్థి, అతడి తల్లి ఇద్దరూ ఒకే మ్యాపింగ్ లో ఉండేలా చూసుకోవాలి. అలా లేకుంటే వెంటనే వాలంటీర్ ను సంప్రదించి మ్యాపింగ్ చేయించుకోవాలి. ఒకవేళ స్టూడెంట్ పేరు రేషన్ కార్డులే లేకుంటే.. బర్త్ సర్టిఫికెట్ ను గ్రామ సచివాలయంలో సమర్పించి రేషన్ కార్డులో చేర్పించాలి.
పొరబాటున తల్లిదండ్రుల పేర్లు అధిక ఆదాయమున్న లిస్టులో ఉంటే.. వెంటనే వారికి ఎకౌంట్ ఉన్న బ్యాంక్ నుంచి ఫాప్-60ని పొంది గ్రామసచివాలయంలో సబ్ మిట్ చేయాలి. అలా చేయకుంటే అమ్మఒడి డబ్బులు రావు.
స్టూడెంట్ మదర్ బ్యాంకు అకౌంట్ కి మ్యాప్ అయిన ఆధార్ ఫోన్ నెంబర్ ఒకటే ఉండే విధంగా చూసుకోవాలి. బ్యాంకు అకౌంట్ కి ఆధార్ లింక్ అయిందా లేదో చెక్ చేసుకొని కాకపోతే లింక్ చేయించుకోవాలి. ఒకవేళ IFSC Code మారిన బ్యాంక్ ఎకౌంట్లు ఉంటే.. వెంటనే కోడ్ ను అప్ డేట్ చేయించుకోవాలి.
What about Oprhan children
ReplyDeleteHow to check
ReplyDeleteTq for a information
ReplyDeleteForm 60 iecchina radu
ReplyDelete