APTF VIZAG: ఏపీ టెన్త్ పరీక్ష ఫలితాలు నేడు విడుదల.. ర్యాంకులు ప్రకటించే విద్యా సంస్థలపై కఠిన చర్యలు.

ఏపీ టెన్త్ పరీక్ష ఫలితాలు నేడు విడుదల.. ర్యాంకులు ప్రకటించే విద్యా సంస్థలపై కఠిన చర్యలు.

ఆంధ్రప్రదేశ్‌లో  పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ ఫలితాలను విడుదల చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 6,21,799 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కాగా, కరోనా కారణంగా రాష్ట్రంలో రెండేళ్లపాటు పదో తరగతి పరీక్షలు నిర్వహించని సంగతి తెలిసిందే.  

ఈసారి పదో తరగతి ఫలితాల్లో గ్రేడింగ్ విధానాన్ని ఎత్తేశారు. గతంలో మాదిరిగా మార్కులనే వెల్లడిస్తారు. విద్యాశాఖ కూడా ఎలాంటి ర్యాంకులను ప్రకటించదు. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలు కనుక ర్యాంకులు ప్రకటిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. తమ వద్ద చదువుకున్న విద్యార్థులు ఫలానా ర్యాంకులు తెచ్చుకున్నారని ప్రచారం చేయడం నేరమని, అలా చేస్తే కనీసం మూడేళ్ల జైలు శిక్ష తప్పదని విద్యాశాఖ హెచ్చరికలు జారీ చేసింది

No comments:

Post a Comment

Featured post

AP Teachers transfers go 2022 released