APTF VIZAG: మండలానికొకటి!బాలికల జూనియర్‌ కళాశాల మంజూరు..ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు.ఉన్నత పాఠశాలల్లోనే గదుల కేటాయింపు

మండలానికొకటి!బాలికల జూనియర్‌ కళాశాల మంజూరు..ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు.ఉన్నత పాఠశాలల్లోనే గదుల కేటాయింపు

విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వ ఆదేశాలు

ఈ విద్యా సంవత్సరం నుంచి జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగు తోంది. బాలికల కోసం ప్రత్యేకంగా మండలానికో జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు తుది దశకు చేరుకున్నాయి. జిల్లాలో 25 మండలాలుండగా, అన్నింటిలో జూని యర్‌ కళాశాలలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపా దనలు పంపారు. కేజీబీవీలు ఉన్న మండలాలను మినహాయించి మిగిలిన అన్నింటిలో కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం గతంలో అనుమతులు ఇచ్చింది. మన జిల్లాలో కేజీబీవీలు లేవు. మచిలీపట్నంలో లేడియాంప్తిల్‌ జూనియర్‌ కళాశాల ఉంది. దీనికి అనుబంధంగా 15 కిలోమీటర్ల దూరంలోని తాళ్ల పాలెంలో బాలికల కోసం జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపారు.

పరిశీలన  బాధ్యతలు డీవైఈవోలకు.

జూనియర్‌ కళాశాల ఏర్పాటు కోసం ఆయా ఉన్నత పాఠశా లల్లోని సౌకర్యాలను పరిశీ లించే బాధ్యతలను డీవైఈవోలకు అప్పగించారు. మచిలీపట్నం డీవైఈవో, గుడివాడ డివిజన్‌కు సంబంధించి అంగలూరు డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో 200, అంతకుమించి విద్యార్థులున్న ఉన్నత పాఠశాలల్లో జూనియర్‌ కళాశాలలను బాలికల కోసం ఏర్పాటు చేయనున్నారు.  కళాశాలలు ఏర్పాటుచేసే ఉన్నత పాఠశాలల్లో తరగతుల నిర్వహణ కోసం రెండు గదులు, ల్యాబ్‌ నిర్వహణ కోసం మరో రెండు గదులు, స్టాఫ్‌రూమ్‌లు అందుబాటులో ఉన్నదీ, లేనిదీ డీవైఈవోలు పరిశీలించి నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఏదైనా మండలంలో ఎయిడెడ్‌ సంస్థలకు చెందిన జూనియర్‌ కళాశాలలున్నా పరిగణనలోకి తీసుకోరు. అక్కడ కూడా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేస్తారు. ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి ఉత్తీర్ణులైన బాలికలను అదే ప్రాంగణంలో ఏర్పాటు చేయబోయే జూనియర్‌ కళాశాలల్లోనే చేర్చే కార్యక్రమంలో భాగంగా టీసీలు ఇవ్వొద్దన్న ఆదేశాలు కూడా ప్రభుత్వం నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయని జిల్లా విద్యాశాఖ కార్యాలయ అధికారులు తెలిపారు. 

టీచర్లకు పదోన్నతులు..లెక్చరర్లుగా నియామకం

మండలానికో బాలికల జూనియర్‌ కళాశాలను ఏర్పాటుచేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు ఉన్న అర్హతలను బట్టి లెక్చరర్లుగా నియమించనున్నారు. కాగా, ఈ విద్యా సంవత్సరం నుంచే బాలికల జూనియర్‌ కళాశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు డీఈవో తాహెరా సుల్తానా తెలిపారు.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today