ప్రతి ఉపాధ్యాయుడు లెసన్ ప్లాన్, డైరి తప్పనిసరిగా వ్రాయాలి.
👉లెసన్ ప్లాన్ వ్రాసే సందర్భంలో లెర్నింగ్ ఔట్ కమ్స్ , లెర్నింగ్ ఆజ్బెక్టివ్స్ స్పష్టంగా వ్రాయాలి.
👉ప్రిన్సిపుల్స్ ఆఫ్ వాల్యుయేషన్ లేకుండా ఎట్టి పరిస్థితులలో ఆన్సర్ స్క్రిప్ట్స్ వావాల్యుయేషన్ చేయరాదు.
👉 తరగతిలో బోధన జరుగుతున్న సమయంలో ప్రతి ఉపాధ్యాయుని పనితీరును వారానికి ఒక సారి ప్రధానోపాధ్యాయుడు,/ డైట్ ఫాకల్టీ / ఎస్ సి ఇ ఆర్ టి ఫాకల్టీ పరిశీలించడం జరుగుతుంది.
👉అకడమిక్ కేలండర్ నందు పొందుపరచిన ప్రతి కార్య క్రమాన్ని తప్పనిసరిగా పాఠశాలలలో అమలుచేయాలి.
👉కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పాఠశాలలో జరిగే ప్రతి క్రార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయి నుండి పర్యవేక్షించడం జరుగుతుంది. చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
👉మొబైల్ ఫోన్ ద్వారా ఉపాధ్యాయుల
ఫేసియల్ అటెండాన్స్ సేకరించడం జరుగుతుంది.
👉ఉపాధ్యాయుల కదలికలను కూడా ఈ అటెండాన్స్ ద్వారా సేకరించడం జరుగుతుంది.
👉స్కూల్ సేఫ్టీ ప్లెడ్జి ప్రతి పాఠశాలలో ప్రదర్శించాలి.
👉ఉయ్ లవ్ రీడింగ్ ప్రోగ్రాము ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా నిర్వహించాలి
👉పాఠశాలలలో జరిగే పరీక్షలను కూడా చాలా పకడ్బందీగా నిర్వహించాలి.
👉ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ప్రతి నెల మొదటి
శనివారం, 6-8 వ తరగతుల విద్యార్థులకు మూడవ శనివారం నో బాగ్ డే నిర్వహించాలి.
👉పాఠశాల ప్రారంభ సమయానికి కనీసం 15 నిమిషాల ముందే ప్రతి ఉపాధ్యాయుడు పాఠశాలకు హాజరు కావాలి.
👉ఫౌండేషనల్ లిటరసీ అండ్ నుమెరసీ స్కిల్స్ ప్రతి విద్యార్థి లో పెంపొందించాలి.
👉కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాము నిర్వహించాలి.
👉అన్ని రకాల రిజిస్టర్లు నిర్వహించాలి. భద్ర పరచాలి.
👉స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ తన పరిధిలోని అన్ని పాఠశాలలను ప్రతి మాసం విజిట్ చేయాలి.
గుర్తించిన లోపాలను ఉన్నతాధికారులకు వ్రాతపూర్వకంగా తెలియజేయాలి.
👉ప్రతి పదిహేను రోజులకు తప్పనిసరిగా ఉపాధ్యాయుల సమీక్షా సమావేశం నిర్వహించాలి.
👉అకడమిక్ కేలండర్ విత్ మోడల్ ఇన్స్టిట్యూషనల్ అండ్ లెసన్ ప్లాన్స్ SCERT వారి నుండి అందించబడుతుంది.
👉విద్యార్థుల డ్రెస్ కోడ్, హెయిర్b స్టైల్ హుందాగా ఉండాలి.
👉స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ద్వారా ప్రతి పాఠశాలలో రోజు వారీ నిర్వహించవలసిన కార్యక్రమాల వివరాలు ఇవ్వడం జరుగుతుంది.
త్వరలో 2022 - 23 అకడమిక్ క్యాలెండర్ విడుదల అవుతుంది.
No comments:
Post a Comment