APTF VIZAG: Agriculture politechnic course entrance test notification released

Agriculture politechnic course entrance test notification released

అగ్రి పాలిసెట్

పదో తరగతి విద్యార్హతతో ఉద్యోగావకాశాలను అందిపు చ్చుకునేందుకు పశువైద్యంలోకి పలు కోర్సులు ఆహ్వానం పలుకు తున్నాయి . గ్రామీణ ప్రాంతాల్లో పది తర్వాత చదువు సాగించ లేని పేద విద్యార్థులకు అపూర్వ అవకాశం కల్పిస్తూ పశుసంవర్ధక పాలిటెక్నిక్ ( డిప్లొమా ) కోర్సును తిరుపతి శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం అందుబాటులోకి తెచ్చింది .

పది ఉత్తీర్ణత సాధిం చినవారు ఇందులో చేరి రెండేళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేస్తే వెటర్నరీ సహాయకుల ఉద్యోగాలకు అర్హులవుతారు . ప్రైవేటు డెయిరీల్లోనూ ఉపాధి పొందేందుకు అవకాశం ఉంది .

అగ్రిపాలిసెట్ ద్వారా ప్రవేశాలు .

వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ డిప్లొమా కోర్సుల్లో ఉమ్మడి ప్రవేశా లకు ' అగ్రిపాలిసెట్ ' నోటిఫికేషన్ను ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యా లయం విడుదల చేసింది . దీని ద్వారా 2022 23 విద్యా సంవత్సరంలో పశువైద్య , వ్యవసాయ , ఉద్యాన , మత్స్య విశ్వవిద్యాల యాల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు . అగ్రిపాలిసెట్ -2022 ప్రవేశ పరీక్ష రాసేందుకు ఎస్ఎస్సీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైనవారు , ఇంటర్ పరీక్ష తప్పిన వారు , మధ్యలో ఆపేసినవారు అర్హులు . వీరు ఆచార్య ఎన్జీరంగా వ్యవ సాయ విశ్వవిద్యాలయం వెబ్సైట్ www.angrau.ac.in వెబ్సైట్ ద్వారా దర ఖాస్తులు చేసుకునేందుకు మే 18 నుంచి జూన్ 1 వ తేదీ వరకు గడువు ఉంది . దరఖాస్తు రుసుము ఎస్సీ , ఎస్టీలకు రూ . 500 , ఇతరులకు రూ .600 లుగా నిర్ణయించారు . జులై 1 న ప్రవేశ పరీక్ష ఉంటుంది .

రెండేళ్ల కోర్సు ఇలా

 కళాశాలలో ప్రవేశాలు పొందినవారు రెండేళ్లపాటు ఈ కోర్సును అభ్యసించాల్సి ఉంది . దీనిలో ఆరు నెలలకు ఒకటి చొప్పున నాలుగు సెమిస్టర్లు ఉంటాయి . 1 , 2 , 3 సెమిస్టర్లలో పశు సంరక్షణ , పోషణ , వైద్యం తదితర అంశాలకు సంబం ధించిన తరగతులను బోధి స్తారు . నాల్గో సెమిస్టర్లో 6 నెలల పాటు మండల పశు వైద్య కేంద్రాల్లో పశువులకు అందించే వైద్య సేవలు , వ్యాధి నిరోధక టీకాలు , పశు సంరక్షణ చర్యలపై పశువైద్య అధికారుల సమక్షంలో క్షేత్ర స్థాయి శిక్షణ ఉంటుంది . డెయిరీ ఫారాలు , కోళ్లఫారా ల్లోనూ శిక్షణ ఉంటుంది . రెండేళ్లు వసతి గృహాల్లోనే ఉండేలా అన్ని సదుపా యాలు కల్పించారు .

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today