APTF VIZAG: CPS పై జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం మళ్లీ వాయిదా

CPS పై జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం మళ్లీ వాయిదా

సీపీఎస్‌పై గురువారం జరగాల్సిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమవేశం మరోసారి వాయిదా పడింది. తొలుత ఉద్యోగ సంఘాలతో ఈ నెల 4న జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం ఉంటుందని ప్రకటించిన ప్రభుత్వం దాన్ని 7వ తేదీకి వాయిదా వేసింది. అయితే గురువారం జరగాల్సి ఈ సమావేశాన్ని కూడా వాయిదా వేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలకు సమాచారం ఇచ్చింది. సమావేశం ఎప్పుడనేది తర్వాత తెలియజేస్తామని తెలిపింది.  జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ప్రభుత్వం రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్‌.సాయి శ్రీనివాస్‌, హెచ్‌.తిమ్మన్న తెలిపారు. ఇక ఏ సమావేశాలూ అవసరం లేదని, ఉమ్మడి ఉద్యమాలతో ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని ప్రకటించారు.

No comments:

Post a Comment