APTF VIZAG: AP Cabinet meeting key decision

AP Cabinet meeting key decision

కేబినెట్‌ నిర్ణయాలివే.

నవరత్నాలు అమల్లో భాగంగా ‘సున్నా వడ్డీ’ పథకం మూడో ఏడాది కూడా కొనసాగించేందుకు రూ.1,259 కోట్లు చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏప్రిల్‌ 22న సున్నా వడ్డీ పథకం నగదు విడుదల.

 తూర్పుగోదావర జిల్లా కొత్తపేటలో 7 మండలాలలతో, 8 మండలాలతో పులివెందులలో రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

    జిల్లాల పునర్విభజనలో భాగంగా 12 పోలీస్‌ సబ్‌ డివిజన్లు, 16 పోలీస్‌ సర్కిళ్ల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది

  జిల్లా పరిషత్‌ల కాల పరిమితి, రిజర్వేషన్లు కొనసాగిస్తూ కేబినెట్‌ తీర్మానించింది.

  చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏర్పాటు చేసిన వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలో కొత్తగా 12 పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్‌ తీర్మానించింది. ఇందులో 7 టీచింగ్‌ పోస్టులు, 5 నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఉన్నాయి.

   చిరు ధాన్యాల పంటలను ప్రోత్సహించేందుకు ఏపీ మిల్లెట్ మిషన్‌ పాలసీని 2022-23 నుంచి 2026-27 వరకు కేబినెట్‌ ఆమోదించింది.

    ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు ఒక అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ను, రెండు ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

      ఉన్నత విద్యాశాఖ కోసం 253 పోస్టులను మంజూరు చేస్తూ కేబినెట్‌ తీర్మానం. ఇందులో 23 ప్రిన్సిపల్‌, 31 టీచింగ్‌ పోస్టులు, 139 నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఉన్నాయి.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏకలవ్య పాఠశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల లో 82 ఎకరాలు, నెల్లూరు జిల్లా ముత్తుకూరులో పారిశ్రామిక పార్కు కోసం 84 ఎకరాల కేటాయింపు.

ప్రభుత్వ వైద్యులు ఎవరూ ప్రైవేటు ప్రాక్టీసు చేయకుండా నిషేధించే తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today