APTF VIZAG: Ammavidi doughts and answers

Ammavidi doughts and answers

అమ్మ ఒడి సందేహాలు - సమాధానాలు

1) అమ్మఒడి కి ఆధార్ కార్డ్ లో కొత్త జిల్లా పేర్లు మార్చుకోవాలా?

Ans: అవసరం లేదు, ప్రభుత్వం  అలాంటి నిబంధన ఏమీ పెట్టలేదు. 

2) అమ్మ ఒడి కి తల్లీ యెక్క బ్యాంకు ఖాతా కి ఆధార్ లింకు చేపించుకోవాలా?

Ans: అవును ఖచ్చితంగా తల్లీ/గార్డియన్ యెక్క ఆధార్ బ్యాంకు ఖాతా కి లింక్ చేసుకోవాలి.

3) ఆధార్ బ్యాంకు ఖాతా ఎక్కడ లింక్ చేసుకోవాలి?

ఖచ్చితంగా బ్యాంక్ లో మత్రమే లింక్ చేపించుకోవాలి, గ్రామ/వార్డ్ సచివాలయం లో చేయరు.

4) అమ్మ ఒడి కొసం ఆధార్, ఫోన్ నెంబరు లింక్ చేసుకోవాలా?

Ans: అవసరం లేదు, కానీ లింక్ చేసుకున్నట్లు ఐతే చాలా ఉపయోగాలు ఉంటాయి.

5) అమ్మ ఒడి కొసం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సరి చూసుకోవాలా?

Ans:అవును మీ యెక్క వాలంటీర్ దగ్గరా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వివరాలు సరి చూసుకోవాలి ఉదా:

తల్లీ మరియు స్టూడెంట్ ఇద్దరూ ఓకే మ్యాపింగ్ లో ఉండాలి, వయస్సు, జెండర్ మొదలైనవి.

6) హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో వివరాలు సరిగా లేకపోతే ఏమీ చేయాలి?*

Ans: వాలంటీర్ దగ్గర Ekyc చేసుకుంటే అప్డేట్ అవుతుంది.

7) హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తల్లీ మరియు స్టూడెంట్ ఓకే మ్యాపింగ్ లో లేకపోతే ఏమీ చేయాలి?

Ans: దీనికి అతి త్వరలో ఆప్షన్ ఇస్తారు.

8)అమ్మఒడి పొందటానికి అర్హత లు ఏమిటి?

Ans: విద్యార్థి హాజరు శాతం 75%, రైస్ కార్డు, కుటుంబం యొక్క మెట్ట భూమి 10ఎకరాల లోపు ఉండాలి, మాగాణి 3ఎకరాలా లోపు ఉండాలి, income tax కట్టి ఉండరాదు, కుటుంబం లో ప్రభుత్వ ఉద్యోగి ఉండరాదు, విద్యుత్ వినియోగం 300 యూనిట్లు మించరాదు, పట్టణ ప్రాంతం లో 1000 SFT  నివాస భూమి మించరాదు, 4వీలర్ కలిగి ఉండకూడదు (ట్యాక్సీ/ట్రాక్టర్ ఉండొచ్చు).

9) అమ్మ ఒడి ప్రాసెస్ సచివాలయం లో చేస్తారా?

 Ans: లేదు, ప్రస్తుతం సచివాలయం లో అమ్మ ఒడి కి సంబంధించి ఎలాంటి లాగిన్ ఇవ్వలేదు, వివరాలకు  గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ ను కలవాలి 

10) అమ్మ ఒడి ప్రక్రియ మొదలు పెట్టారా?

Ans: ప్రస్తుతం ఇంకా ప్రాథమిక స్థాయి లోనే ఉంది.

1 comment: