APTF VIZAG: పది బోధించే ఉపాధ్యాయులకు సెలవులు లేవు.అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఇవ్వాలి విద్యార్థులను సన్నద్ధం చేయడంపై మార్గదర్శకాలు విడుదల

పది బోధించే ఉపాధ్యాయులకు సెలవులు లేవు.అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఇవ్వాలి విద్యార్థులను సన్నద్ధం చేయడంపై మార్గదర్శకాలు విడుదల

పదో తరగతికి బోధించే ఉపాధ్యాయులకు పరీక్షలయ్యే వరకు సెలవులు ఇవ్వొద్దని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు . అసాధారణ పరిస్థితుల్లో తప్ప , సెలవులు మంజూరు చేయొద్దని జిల్లా విద్యాధికారులకు సూచించారు . ఉపాధ్యాయులు లేకుండా ఏ తరగతి ఉండకూడదని పేర్కొన్నారు . పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడంపై మార్గదర్శకాలు విడుదల చేశారు . మొదటిసారిగా పదిలో ఏడు పేపర్ల విధానం ప్రవేశపెట్టామని , పాఠ్య ప్రణాళికపై విద్యార్థులకు సమాచారం ఇవ్వాలని సూచించారు . విద్యార్థులందరూ ప్రతిరోజు హాజరయ్యేలా చూడాలని , అన్ని సబ్జెక్టులను కవర్ చేసేలా రోజువారీ ప్రణాళిక చేసుకోవాలని ఆదేశించారు . యూట్యూబ్ ఛానల్స్ , దీక్ష పోర్టల్లో ఉండే మెటీరియల్ను వినియోగించుకొని , పునశ్చరణ నిర్వహించాలని సూచించారు .

ప్రత్యేక శ్రద్ధ .చదువులో వెనుకబడిన వారిని సబ్జెక్టుల వారీగా గుర్తించాలి . బ్లూప్రింట్ ప్రశ్నపత్రాల ఆధారంగా ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలి . ఇంటి వద్ద చదువుకోవడం , పిల్లలు కలిసి చదువుకోవడం చేయించాలి . పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులకు మద్దతు ఇచ్చేందుకు వారిని ఉపాధ్యాయులు దత్తత తీసుకోవాలి .  గతేడాది పదోతరగతి ప్రశ్నపత్రాలను సేకరించి , వాటితో ప్రాక్టీస్ చేయించాలి . ఒత్తిడి తొలగించేందుకు వ్యక్తిత్వ వికాసం తరగతులు నిర్వహించాలి . సాధారణ , వెనుకబడిన , చదువులో ముందుండే వారికి సమాన ప్రాధాన్యం ఇవ్వాలి.

ఇళ్ల వద్ద చదువుకునే వాతావరణం కల్పించేందుకు తల్లిదండ్రులతో మాట్లాడాలి . చదువులో వెనుకబడిన వారిని విమర్శించవద్దు . పాఠశాల సమయంలో ఉపాధ్యాయులు బయటకు వెళ్లకూడదు . తరగతి సమయంలో ఫోన్లు వినియోగించవద్దు .

No comments:

Post a Comment