ఈ నెల 16 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పబ్లిక్ పరీక్షలు ఈ నెల 16 నుంచి జరగనున్నాయి. నాన్ జంబ్లింగ్ విధానంలో ఏప్రిల్ 7వ తేది వరకు జరుగుతాయని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరి బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈ నెల 14వ తేది నుంచి హాల్ టిక్కెట్లను బోర్డు వెబ్‌సైట్ bie.ap.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 11 నుంచి జంబ్లింగ్‌లో నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ముందుగా ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను ఈ నెల 10న హైకోర్టు నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో బోర్డు కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది
No comments:
Post a Comment