APTF VIZAG: మధ్యంతర ఉత్తర్వులు : ఏ ఉద్యోగి జీతం నుంచి రికవరీ చేయొద్దని ఏ.పి హై కోర్ట్ ప్రభుత్వానికి ఆదేశం

మధ్యంతర ఉత్తర్వులు : ఏ ఉద్యోగి జీతం నుంచి రికవరీ చేయొద్దని ఏ.పి హై కోర్ట్ ప్రభుత్వానికి ఆదేశం

 ★ పీఆర్సీలో జీతాలు తగ్గాయంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. 

★ జీవోలో పేర్కొన్న విధంగా రికవరీ లేకుండా జీతాలు వెయ్యాలని ప్రభుత్వానికి కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. 

★ జీతాల్లో రికవరీ చేయటం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది.

★ పీఆర్సీపై నియమించిన ఆశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక ఇవ్వలేదని న్యాయవాది రవితేజ వాదనలు వినిపించారు. 

★ జీవోల్లో ఎరియర్స్ కట్ చేయటాన్ని ఆయన ప్రస్తావించారు. కాగా... ఈ వ్యవహారంలో అనేక అంశాలు ముడిపడి ఉండటంతో ప్రభుత్వం సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.

★ తదుపరి విచారణను ఫిబ్రవరి 23కు వాయిదా వేసింది. పీఆర్సీలో జీతాలు తగ్గాయని హైకోర్టులో గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment