APTF VIZAG: AP 10th class and intermediate exam shedule

AP 10th class and intermediate exam shedule

Andhra Pradesh  టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.

ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు.మే 2 నుంచి మే 13 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ గురువారం విడుదలైంది. టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల షెడ్యూలను మంత్రులు ఆదిమూలపు సురేష్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విడుదల చేశారు.

ఇంటర్మీడియట్ పరిక్షల షెడ్యూల్‌:

మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరిక్షలు, ఏప్రిల్ 8 నుండి 28 వరకు ఇంటర్మీడియట్‌ బోర్డు పరిక్షలు జరుగుతాయని ఏపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.1456 సెంటర్లలో ఈ పరిక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొదటి సంవత్సరం 5,05,052 మంది విద్యార్థులు, రెండో సంవత్సరం 4,81,481 విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. మొత్తం 9,86,533 మంది విద్యార్థులు ఈ పరిక్షలు రాయనున్నారని తెలిపారు.

పదో తరగతి పరిక్షల షెడ్యూల్‌:

టెన్త్‌ పరీక్షల తేదీలను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. 2022 సంవత్సరం మే 2 నుంచి మే13 వరకు పదో తరగతి పరిక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మొత్తం 6,39,805 మంది విద్యార్థులు పదోతరగతి పరిక్షలు రాయనున్నారని తెలిపారు.

No comments:

Post a Comment