APTF VIZAG: 50వేల మందికి 2 గంటల్లో భోజనం.జగనన్న గోరుముద్దకు కేంద్రీకృత వంటశాల ప్రారంభం

50వేల మందికి 2 గంటల్లో భోజనం.జగనన్న గోరుముద్దకు కేంద్రీకృత వంటశాల ప్రారంభం

గుంటూరు జిల్లాలో అక్షయపాత్ర ఫౌండేషన్‌ ద్వారా పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం (జగనన్నగోరుముద్ద) సరఫరా చేయడానికి మంగళగిరి మండలం ఆత్మకూరులో నిర్మించిన అత్యాధునిక కేంద్రీకృత వంటశాలను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం ప్రారంభించారు. రెండు గంటల్లోనే 50వేల మంది విద్యార్థులకు ఆహారం తయారుచేసే ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి.

ఉదయం 10.45కు కేంద్రీకృత వంటశాల ప్రాంగణానికి సీఎం చేరుకున్నారు. గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మంత్రులు ఆదిమూలపు సురేష్‌, వెలంపల్లి శ్రీనివాస్‌, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. కేంద్రీకృత వంటశాల శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించి, స్విచ్‌ నొక్కి వంటశాలను ప్రారంభించారు. విద్యార్థినులతో ముచ్చటించి వారిని దీవించారు. విద్యార్థులకు అందించే వంటకాలలో చిక్కీని రుచి చూశారు. ఆహారాన్ని విద్యార్థినులకు స్వయంగా వడ్డించి వారిని పలకరించారు. అనంతరం పాఠశాలలకు ఆహారాన్ని రవాణా చేసే వాహనాలను నేతలతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. బెంగళూరు బృందావన చంద్రోదయ మందిర్‌ ఛైర్మన్‌ మధు పండిట్‌దాస్‌, హరేకృష్ణ ఉద్యమం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు పలు అంశాలపై వినతులు అందించారు

No comments:

Post a Comment