ఇక ఎంఈవోలకే డ్రాయింగ్ అధికారాలు8,9,10 తరగతులకు డిజిటల్ పాఠాలుఈనెల 15నుంచి నాడు-నేడు రెండో విడతటీచర్లకు తప్పిన యాప్‌ల బెడద!..
అమరావతి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): జూన్ నుంచి నూతన విద్యావిధానం అమల్లోకి తేవాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. గురువారం తాడేపల్లి కాంపు కార్యాలయంలో నూతన విద్యావిధానం అమలుపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలని నిర్దేశించారు. ఈ సందర్భంగా నూతన విద్యావిధానం అమలుపై అధికారులు సీఎంకు వివరాలు అందించారు. నూతన విద్యావిధానంలో తరగతుల విలీనమే కానీ, బడుల మూత ఉండదని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నూతన విద్యావిధానంలో ఏర్పాటవుతున్న పాఠశాలల వల్ల 22వేలమంది ఎస్జీటీలకు పదోన్నతులు వస్తాయని.. వీరందరికీ స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులివ్వాలని ఆదేశించారు.
సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు ఉండాలన్నారు. విద్యార్థుల నుంచి ఆన్‌లైన్ పద్ధతిలో హాజరు తీసుకోవాలన్నారు. ప్రతి మండలంలోని రెండు హైస్కూళ్లలో రెండు జూనియర్ కళాశాలలుగా ఏర్పాటు చేయాలని.. ఒకటి కో ఎడ్యుకేషన్‌కు, ఒకటి బాలికలకు ఉండాలని సూచించారు. మరోవైపు ఎస్‌ఈఆర్‌టీ ఇచ్చిన సిఫారసులన్నీ అమల్లోకి రావాలన్నారు. మండల రిసోర్స్ సెంటర్‌ను మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంగా మార్చాలని నిర్ణయించారు. ఎండీవో పరిధిలో కాకుండా ఇక నేరుగా ఎంఈవోకే డ్రాయింగ్ అధికారాలు, విద్యాశాఖ కార్యకలాపాలు అప్పగించాలన్నారు. ఈ నెల 15నుంచి నాడు-నేడు రెండో విడత పనులు ప్రారంభించాలన్నారు. నాడు-నేడు రెండో విడత పనులను సెప్టెంబరు నాటికల్లా పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. ఉపాధ్యాయులకు పలు రకాల యాప్స్ కంటే.. రియల్‌టైం డేటా ఉండేలా, డూప్లికేషన్ లేకుండా చూడాలన్న ఎస్‌ఈఆర్‌టీ సిఫారసులు అమల్లోకి తీసుకురావాలని సీఎం సూచించారు. పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించొద్దని, ప్రధానోపాధ్యాయులతో అనేక సమావేశాలు కాకుండా సమన్వయం కోసం నెలకు ఒకే ఒక సమావేశం ఏర్పాటుచేయాలన్న సిఫారసులకు సీఎం ఆమోదం తెలిపారు. నూతన విద్యావిధానంలో మూడు కిలోమీటర్ల లోపే హైస్కూల్ ఉండేలా మ్యాపింగ్ చేస్తున్నామని అధికారులు వివరించారు. మరుగుదొడ్లు, గోరుముద్దపై టోల్‌ఫ్రీ నంబర్‌నాడు-నేడులో.. ఏ సదుపాయాల్లో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. జగనన్న విద్యాకానుక, మరుగుదొడ్ల నిర్వహణ, జగనన్న గోరుముద్ద నాణ్యత, స్కూళ్ల నిర్వహణకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే తెలిపేందుకు టోల్‌ఫ్రీ నంబరు 14417ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పాఠశాలల్లో కొత్తగా చేరిన విద్యార్థులకు డిక్షనరీ ఇవ్వాలని, రోజుకో కొత్త పదం నేర్పించాలన్నారు. 8,9,10తరగతుల్లో డిజిటల్ లెర్నింగ్ ప్రవేశపెట్టాలని, దీన్ని ఒక సబ్జెక్టుగా పెట్టే ఆలోచన చేయాలని సీఎం సూచించారు. ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్‌శర్మ, పాఠశాల విద్య స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.ఆర్.అనూరాధ పాల్గొన్నారు.
No comments:
Post a Comment