AP ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్న PRC తుది అంకానికి చేరింది. ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్న విధంగా నేరుగా ముఖ్యమంత్రితో సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది.
రేపు (గురువారం) ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.
ఇంకా పీఆర్సీ వ్యవహారం పైన నాన్చటం సరి కాదని..తేల్చేయాలని సీఎం డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ఈరోజు మధ్నాహ్నం ముందస్తుగా సీఎం జగన్ సీఎస్ సమీర్ శర్మ..ఆర్దిక శాఖ అధికారులతో సీఎం సమీక్ష ఏర్పాటు చేసారు.
అందులో ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సారాంశం... ఉద్యోగులు ఫిట్ మెంట్ గా ఎంత కోరుతున్నారనే అంశం పైన అధికారులు సీఎంకు వివరించనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ తాము గతంలో ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తున్న 27 శాతం IR కంటే ఎక్కువగా ఫిట్ మెంట్ ఉండాలని సూచించారు. అయితే, అధికారులు మాత్రం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చల సమయంలో ఫిట్ మెంట్ అంశం పైన ప్రస్తావన లేకుండానే..రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల పైన వివరిస్తూ వచ్చారు. దీనిపైన సంఘాలు అసహనం వ్యక్తం చేశాయి.
No comments:
Post a Comment