APTF VIZAG: Night curfew in ap

Night curfew in ap

 ఏపీలో నైట్ కర్ఫ్యూ

కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను విధుస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం కోవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ విధించాలని ఆదేశించారు. భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా చూడాలన్నారు. మాస్క్‌లు ధరించకపోతే జరిమానాను కొనసాగించాలని స్పష్టం చేశారు. దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కోవిడ్‌ ఆంక్షలు పాటించేలా చూడాలని అధికారులకు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్‌డోర్స్‌లో 100 మంది మించకుండా చూడాలని సీఎం ఆదేశించారు. థియేటర్లలో సీటు మార్చి సీటుకు అనుమతించాలని. అలాగే  మాస్క్‌ తప్పనిసరి చేయాలన్నారు. దేవలయాలు, ప్రార్థనా మందిరాల్లో కూడా భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌ ధరించేలా చూడాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ

No comments:

Post a Comment