APTF VIZAG: Income tax department good news to tax payers

Income tax department good news to tax payers

ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కేంద్రం తీపికబురు..!

 పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను శాఖ తీపికబురు అందించింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు గడువును మార్చి 15 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. వాస్తవానికి ఈ గడువు డిసెంబర్ 31 వరకే ఉంది. ఈ రిటర్న్ ఫైలింగ్ గడువు పొడిగింపు గురించి ఆదాయపు పన్ను శాఖ కూడా ట్వీట్ చేసింది. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితి కారణంగా పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల కారణంగా మార్చి 15 వరకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు సీబీడీటీ తెలిపింది. ఆదాయపు పన్ను చట్టం 1961 నిబంధనల కింద వివిధ ఆడిట్ నివేదికలను ఈ-ఫైలింగ్ చేస్తున్నప్పుడు ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా గడువును కూడా పొడిగించినట్లు పేర్కొంది.

2021, ఏప్రిల్‌ 1 నుంచి 2022, జనవరి 3 వరకు 1.48 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రత్యక్ష్య పన్నుల శాఖ (సీబీడీటీ) రూ.1,50,407 కోట్లకు పైగా రీఫండ్స్‌ విడుదల చేసినట్లు ఆదాయపన్ను శాఖ జనవరి 5న తెలిపింది. ఇందులో 1.46 కోట్ల మందికి రూ.51,194 కోట్లు ఇన్‌కం టాక్స్‌ రీఫండ్స్‌ జారీ చేయగా 2.19 లక్షల మందికి కార్పొరేట్‌ టాక్స్‌ రీఫండ్‌ రూపంలో రూ.99,213 కోట్లు రీఫండ్‌ చేసింది

No comments:

Post a Comment