APTF VIZAG: నేటినుంచి మళ్లీ బడులు.పండుగ సెలవుల పొడగింపు లేదు.పిల్లల భవిష్యత్ కోసమే తెరుస్తున్నాం.ఆరోగ్య భద్రతకు డోకా లేదు.విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్.

నేటినుంచి మళ్లీ బడులు.పండుగ సెలవుల పొడగింపు లేదు.పిల్లల భవిష్యత్ కోసమే తెరుస్తున్నాం.ఆరోగ్య భద్రతకు డోకా లేదు.విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్.

రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు పొడిగింపు ఆలోచన లేదని, ప్రకటించిన విధంగా షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి యథావిధిగా పాఠశాలలు తెరుచుకుంటాయని విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. అలాగే పొరుగు రాష్ట్రాలైన తెలంగాణలో నెలాఖరు వరకు సెలవులు పొడిగించినట్లు ప్రకటించారు. తమిళనాడు, కర్ణాటకల్లోనూ ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు పొడిగింపుపై విద్యాశాఖలో విస్తృత చర్చ జరిగింది. అలాగే సూళ్లు సెలవు పెంపుపై సోమవారం విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో సెలవుల విషయమై తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ఉన్న సందిగ్ధాన్ని తొలగిస్తూ మంత్రి ఆదివారం స్పందించారు. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య భద్రతతో పాటు వారి భవిష్యత్తును గురించి కూడా ఆలోచిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేశామని, 15 నుంచి 18 సంవత్సరాల వయసు విద్యార్థులకు కూడా దాదాపు 92 శాతం వ్యాక్సిన్ వేయడం జరిగం దని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలోపెట్టుకొని పాఠశాలలను యథావిధిగా నడపాలని ఆలోచి స్తూనే వారి ఆరోగ్య భద్రతపై కూడా డేగ కన్నుతో నిఘా ఉంచడం జరిగిందన్నారు. కోవిడ్ నిబంధనలను అనుసరి స్తూ పాఠశాలలను నడిపేందుకు అన్ని చర్యలు తీసుకుం టున్నామన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎటు వంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్ప ష్టం చేశారు. ఇప్పటికైతే పాఠశాలలకు సెలవులు ప్రకటించే ఆలోచన లేదని, భవిష్యత్తులో కేసుల తీవ్రతను బట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు ఆలోచిస్తామని మంత్రి డా. సురేష్ పేర్కొన్నారు.

ట్రిపుల్ ఐటీలపై అస్పష్టత

రాష్ట్రంలోని నాలుగు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ట్రిపుల్ ఐటీ)లు సంక్రాంతి సెల వుల తర్వాత తిరిగి తెరుచుకునే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. శ్రీకాకుళం, నూజివీడు, ఒంగోలు, ఆర్కే వ్యాలీల్లో ఉన్న ట్రిపుల్ ఐటీల్లో వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి సంక్రాంతి సెలవులు ఈ నెల 18 వరకు ప్రకటించారు. అయితే కరోనా వేగంగా విస్తరిస్తున్న పరిస్థితులపై ఆర్జీయూకేటికి వందల సంఖ్యలో విజ్ఞ ప్తులు అందాయి.

అంతేకాకుండా ఈ క్యాంపన్లలో చదివే విద్యార్థు అంతా వివిధ జిల్లాలు, ప్రాంతాలకు చెందిన వారు కావ డంతో పునః ప్రారంభంపై ఉన్నతాధికారులకు తమ సం దేహాలను వివరించారు. వీటిపై సమీక్షించిన ఆర్జీయూ కేటీ చాన్స్లర్, వీసీలు స్పష్టమైన సమాచారం అందే వర కు విద్యార్థులు కళాశాలలకు బయలుదేరవద్దని సూచిం చారు, ప్రతి విద్యార్థికి కళాశాలల పునఃప్రారం భంపై వ్యక్తిగతంగా సమాచారం అందిస్తామని తెలియజేశారు. దీంతో వేలాది మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీల ప్రారంభ సమాచారం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారుల నుంచి ప్రకటన రావాల్సి ఉంది.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today