రాష్ట్రంలో మార్చిలోనే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందన్నారు. గుంటూరు జిల్లా వినుకొండలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ సిలబస్ దాదాపు పూర్తికావచ్చిందన్నారు. టెన్త్ పరీక్షల్లో 7 ప్రశ్నపత్రాలు ఉంటాయని, విద్యార్థులు సిద్ధంగా ఉండాలని సూచించారు. అఽధక ఫీజుల వసూళ్లపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే ఆయా పాఠశాలల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
No comments:
Post a Comment