APTF VIZAG: ఫైలు వచ్చాక నిర్ణయం.పీఆర్సీ వ్యాజ్యంపై స్పష్టం చేసిన సీజే

ఫైలు వచ్చాక నిర్ణయం.పీఆర్సీ వ్యాజ్యంపై స్పష్టం చేసిన సీజే

ఉద్యోగుల వేతన సవ రణ(పీఆర్సీ) విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులను సవా లుచేస్తూ దాఖలైన వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని న్యాయవాది రవితేజ మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. సీజే స్పందిస్తూ ఇంకా ఆ ఫైలు తన వద్దకు రాలేదని, హైకోర్టు రిజిస్ట్రీ తన ముందు ఉంచాక పరిపాలనా పర మైన నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఈనెల 17న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ గెజిటెడ్ అధికారులు ఐకాస ఛైర్మన్ కేవీ కృష్ణయ్య హైకోర్టులో వ్యాజ్యం వేసిన విషయం తెలి సిందే. ఏ బెంచ్ ముందుకు ఈ వ్యాజ్యం విచారణకు వెళ్లాలో పరిపాలనా పరమైన నిర్ణయం తీసుకునేందుకు ఫైల్ను సీజే వద్ద ఉంచాలని జస్టిస్ అసనుద్దీన్ అమా నుల్లా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం రిజిస్ట్రీని ఆదేశించిన విషయం తెలిసింద

No comments:

Post a Comment