APTF VIZAG: సీఎం జగన్‌తో ఉద్యోగ సంఘాల చర్చలు ప్రారంభం

సీఎం జగన్‌తో ఉద్యోగ సంఘాల చర్చలు ప్రారంభం


ఏపీ సీఎం జగన్‌తో ఉద్యోగ సంఘాల చర్చలు ప్రారంభమయ్యాయి. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లోని 13 ఉద్యోగ సంఘాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. 71 డిమాండ్లతో ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసు ఇచ్చాయి. దీనిపై సీఎస్‌, ఇతర అధికారులు చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదు. వీటిలో ప్రధానంగా పీఆర్సీ, సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసులు పర్మినెంట్‌ చేయడం తదితర డిమాండ్లు ఉన్నాయి. వీటిని సత్వరమే పరిష్కరించాలని ఆయా సంఘాల నేతలు సీఎంను కోరనున్నారు. 

ఉద్యోగులు 55 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇటీవల సీఎస్‌ కమిటీ 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీన్ని ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి. తమకు 55 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తేనే ఆమోదయోగ్యంగా ఉంటుందని పునరుద్ఘాటించాయి. కరోనా పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 14.29 శాతానికి అంగీకరించాలని ప్రభుత్వ వర్గాలు చెప్పినప్పటికీ ఉద్యోగులు వెనక్కితగ్గలేదు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌తో ఉద్యోగ సంఘాల చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది

No comments:

Post a Comment