APTF VIZAG: పీఆర్సీపై ముఖ్యమంత్రితో నేడు భేటీ.అందరూ అందుబాటులో ఉండండి.ఉద్యోగ సంఘాల నేతలకు సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఫోన్‌

పీఆర్సీపై ముఖ్యమంత్రితో నేడు భేటీ.అందరూ అందుబాటులో ఉండండి.ఉద్యోగ సంఘాల నేతలకు సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఫోన్‌

పీఆర్సీపై చర్చల కోసం ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్‌ గురువారం సమావేశం కానున్నారు. ఈ మేరకు జేఏసీ నేతలకు ఏపీ ఎన్జీవో సంఘం మాజీ నేత, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి సమాచారం అందించారు. ఈ సమావేశానికి అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ భేటీతో పీఆర్సీ అంశం ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. ఇదిలాఉండగా, పీఆర్సీపై సీఎం జగన్‌తో బుధవారం మరోసారి ఆర్థిక శాఖ అధికారులు భేటీ అయ్యారు. ఈ భేటీలో సీఎస్‌ సమీర్‌శర్మ, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 14.29శాతంపై ఎంత శాతం పెంచితే ఎంత భారం అదనంగా పడుతుందనే అంశంపై సీఎంకు ఆర్థికశాఖ అధికారులు నివేదిక ఇచ్చినట్లు లీకులు ఇచ్చారు.

ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం సమావేశం కానున్నట్లు రోజంతా ప్రచారం చేశారు. నిజానికి, పీఆర్సీకి సంబంధించిన చర్చల ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. అయితే నేడు.. రేపు సీఎం వద్ద చర్చలు అంటూ ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం ఊరిస్తోంది. గురువారం అయినా సీఎం దర్శనం నేతలకు దొరుకుతుందా? పీఆర్సీపై పీటముడి వీడుతుందా? అనే చర్చలు ఉద్యోగుల్లో మొదలయ్యాయి.

No comments:

Post a Comment