పీఆర్సీ ఇలా రావడానికి తమ తప్పు కూడా ఉందని సచివాలయ ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఆధిపత్యం కోసం చేసిన ప్రయత్నాలు నష్టం కలిగించాయని, తమలో అనైక్యతను ప్రభుత్వం అలుసుగా తీసుకుందని ఆయన చెప్పారు. కర్నూలులో ఉద్యోగుల దీక్షల్లో వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై ఉద్యోగసంఘాలు ఐక్య పోరాటం చేస్తామని ప్రకటించారు. ఉద్యోగుల్లో చీలిక తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. పీఆర్సీ సాధించే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ఉద్యోగులు సమ్మెకి వెళ్లకుండా నివారించడమనేదిప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉందని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు
No comments:
Post a Comment