PRC Fitment పై సీఎం తో ముగిసిన చర్చలు - సజ్జల
Fitment (IR కంటే ఎక్కువ) ఖరారు, రెండు మూడు రోజుల్లో తుది నిర్ణయం (అధికారులతో చర్చలు)
క్రిస్మస్ పండుగ తర్వాత (పండుగ వలన ముఖ్యమంత్రి గారు బిజీ గా వుంటారు) తుది నిర్ణయం.
నూతన సంవత్సర కానుకగా PRC ప్రకటన.
ఈ నెలాఖరులోపు ఫిట్మెంట్ పై నిర్ణయం సజ్జల ప్రకటన..
ఉద్యోగుల పీఆర్సీ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంతర్గత సమీక్ష ముగిసింది. గత సమావేశంలో చర్చించిన అంశాలతో పాటు.. మరికొన్ని అంశాలపై కూడా సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.
అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రితో ఉద్యోగుల ఫిట్మెంట్ పై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించాము. ఐ ఆర్ కంటే తగ్గకుండా ఉద్యోగులు నష్టపోకుండా ఫిట్మెంట్ ఉండేలా చూడమని సీఎం జగన్ చెప్పారు. తెలంగాణలో ఐఆర్ ఇవ్వకుండా ఫిట్మెంట్ 30శాతం ఇచ్చారు. మన దగ్గర ముందస్తుగానే 27 శాతం ఐఆర్ ఇచ్చాము. అయినా ఉద్యోగులు 14.29 శాతం ఫిట్మెంట్ తో నష్ట పోతున్నాం అని అంటున్నారు. వాళ్లకి నష్టం రాకుండా ప్రతిపాదనలతో రావాలని సీఎం చెప్పారు. దీనివల్ల ఫిట్మెంట్ విషయం క్రిస్టమస్ తర్వాత నిర్ణయించే అవకాశం ఉంది అని తెలిపారు. ఈ లోపు అధికారులు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి. ఓ నిర్ణయానికి వస్తారు. ఆర్థికేతర అంశాలను వెంటనే పరిష్కరించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ నాలుగైదు రోజుల్లో ఆర్థికేతర అంశాలను అధికారులు పరిష్కరిస్తారు. ఈ నెలాఖరులోపు ఫిట్మెంట్ పై నిర్ణయం ఉంటుంది. పి ఆర్సీ పై ముఖ్యమంత్రి తో వివరంగా చర్చించాం. ఈ అంశం త్వరలోనే కొలిక్కి వస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులకు వివరించామని సజ్జల తెలిపారు.
No comments:
Post a Comment