APTF VIZAG: PRC పదిరోజుల్లో- AP ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్

PRC పదిరోజుల్లో- AP ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్

ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ జగన్ తిరుపతి పర్యటనలో ఏపి ప్రభుత్వ ఉద్యోగులకు తమ ప్రభుత్వం 10 రోజులలో పి.ఆర్.సి ప్రకటిస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రకియ దాదాపు పూర్తి అయిందని తెలిపారు. తిరుపతిలో వరదల కారణంగా నష్టపోయిన ప్రాంతాలను శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఈమేరకు ఆయన కృష్ణ నగర్ లో వరదలతో దెబ్బతిన్న ఇళ్లను స్వయంగా పరిశీలించారు.నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకొంటుందని ఏమాత్రం అధైర్యపడవద్దని బాధితులకు భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా తనని కలిసి పి.ఆర్.సి (PRC) ఇవ్వాలని కోరిన ప్రభుత్వ ఉద్యోగులకు 10 రోజులలో (PRC) పి.ఆర్.సి ఇస్తామని అన్నారు. ఇందుకు సంబంధించిన పక్రియను దాదాపు పూర్తి అయిందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

No comments:

Post a Comment