APTF VIZAG: Omicron: భారత్‌లో రెండు ఒమిక్రాన్ కేసులు: కేంద్రం

Omicron: భారత్‌లో రెండు ఒమిక్రాన్ కేసులు: కేంద్రం

 ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్‌ భారత్‌లోకి ప్రవేశించింది. భారత్‌లో ఈ కొత్త వేరియంట్‌ కేసులు నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ రెండు కేసులూ కర్ణాటకలో వెలుగుచూసినట్టు తెలిపింది. భారత్‌ కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 29 దేశాల్లో ఇప్పటివరకు 373 ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు.

దక్షిణాఫ్రికాలో అత్యధికంగా 183 ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూడగా.. బోట్స్‌వానాలో 19, నెదర్లాండ్స్‌ 16, హాంగ్‌కాంగ్‌ 7, ఇజ్రాయిల్‌ 2, బెల్జియం 2, యూకే 32, జర్మనీ 10, ఆస్ట్రేలియా 8, ఇటలీ 4, డెన్మార్క్‌ 6, ఆస్ట్రియా 4, కెనడా 7, స్వీడెన్‌ 4, స్విట్జర్లాండ్‌ 3, స్పెయిన్‌ 2, పోర్చుగల్‌ 13, జపాన్‌ 2, ఫ్రాన్స్‌ 1, ఘనా 33, దక్షిణ కొరియా 3, నైజీరియా 3, బ్రెజిల్‌ 2, నార్వే 2, అమెరికా, సౌదీ అరేబియా, ఐర్లాండ్‌ యూఏఈలలో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్టు వివరించారు.

No comments:

Post a Comment