APTF VIZAG: పీఆర్‌సీ నివేదికలో సవరణలు.. అందుకే ప్రకటనకు ఆలస్యం: సజ్జల

పీఆర్‌సీ నివేదికలో సవరణలు.. అందుకే ప్రకటనకు ఆలస్యం: సజ్జల

పీఆర్‌సీ ప్రకటనకు మరికొంత సమయం పట్టవచ్చని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సీఎంతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సీఎం ఆదేశాల మేరకు పీఆర్‌సీపై మళ్లీ కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. 

‘‘ పీఆర్‌సీ నివేదికలో స్వల్ప సవరణలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ రేపట్నుంచి వేగవంతం అవుతుంది. మెరుగైన పీఆర్‌సీ ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఉద్యోగులు అసంతృప్తి చెందకూడదన్నదే సీఎం ఉద్దేశం. ఫిట్‌మెంట్‌ పెంచడమే లక్ష్యంగా కసరత్తు జరుగుతోంది. బడ్జెట్‌పై పడే పీఆర్‌సీ భారం అంచనా వేస్తున్నాం. పీఆర్‌సీ భారం అంచనావల్లే ప్రక్రియ ఆలస్యమవుతోంది. 

ప్రస్తుతం కంటే తప్పకుండా వేతనం పెరుగుదల ఉంటుంది. ఉద్యోగ సంఘాలతో త్వరలో సీఎం జగన్‌ చర్చలు ఉంటాయి’’ అని  సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు

No comments:

Post a Comment