APTF VIZAG: రెండో రోజూ పీఆర్సీపై సీఎం సమీక్ష. జగన్‌తో బుగ్గన, సజ్జల భేటీ

రెండో రోజూ పీఆర్సీపై సీఎం సమీక్ష. జగన్‌తో బుగ్గన, సజ్జల భేటీ

ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీతో పాటు ఇతర సమస్యల పరిష్కారంపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో సీఎం జగన్‌ వరుసగా రెండోరోజూ సమీక్షించారు. గురువారం నాడు వీరిద్దరితో సుమారు గంటసేపు సమీక్షించిన జగన్‌ శుక్రవారం దాదాపు 2గంటల సేపు చర్చించారు. ఈ సమీక్షలో పీఆర్సీపై తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ వ్యవహారాన్ని సోమవారం నాటికి ఒక కొలిక్కి తీసుకువద్దామన్న సీఎం... విశాఖ పర్యటనకు వెళ్లిపోయారు. 

No comments:

Post a Comment