రాష్ట్రంలో 100లోపు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలల్లోకి ప్రాథమిక బడుల నుంచి 3, 4, 5 తరగతులను విలీనం చేయకూడదని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.
ఏ యాజమాన్య పాఠశాలను అదే యాజమాన్య బడిలో మాత్రమే కలపాలని, గిరిజన సంక్షేమ పాఠశాలలను ప్రస్తుతానికి విలీన ప్రక్రియ నుంచి మినహాయించాలని సూచించింది.
కిలోమీటరు లోపు వేరే మండలం పాఠశాల ఉన్నా యాజమాన్యం ఒక్కటే అయితే తరగతులను విలీనం చేస్తారు.
20 మంది కంటే తక్కువ విద్యార్థులున్న ప్రాథమిక బడుల నుంచి 3, 4, 5 తరగతులను విలీనం చేయరు.
ఉన్నత పాఠశాలల్లో వెయ్యి మంది కంటే ఎక్కువ పిల్లలున్న వాటిలోనూ 3, 4, 5 తరగతులను కలపరు.
No comments:
Post a Comment