APTF VIZAG: Navodaya 6th class admission entrance exam and online application complete information

Navodaya 6th class admission entrance exam and online application complete information

నవోదయ నోటిఫికేషన్-2021-22

నవోదయ విద్యాలయలో 2022 - 23 విద్యా సంవత్సరంలో 6 వ తరగతి ప్రవేశం కొరకు జరిగే ప్రవేశ పరీక్ష కోసం ఈ నెల 20వ తేదీ నుండి 2021 నవంబర్ 30వ తేదీ లోపల ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు

1. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వ పాఠశాలలో గానీ, ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో గానీ 2019 - 2020 , 2020-21, విద్యా సంవత్సరాలలో వరుసగా 3,4, తరగతులు చదివి ఉండాలి. 2021-22 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉండాలి.

2. అభ్యర్థులు 01/05/2009 నుండి 30/04/2013 మధ్య పుట్టిన వారై ఉండాలి.( ఈ రెండు తేదీలను కలుపుకొని ) ఈ క్రింద ఇవ్వబడిన వెబ్ సైట్లు ద్వారా దరఖాస్తు ఫారంని డౌన్ లోడ్ చేసుకొని దానిని పూర్తి చేసి, 5వ తరగతి చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారా ధృవీకరింపజేసీ మరల దానిని అన్ లైన్ లో అప్లోడ్ చెయ్యాలి.

 డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారంలోని నియమ నిబంధనలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జాగ్రత్తగా గమనించి దరఖాస్తులను ఆన్లైన్ లో అప్లోడ్ చెయ్యాలి.

ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రారంభ తేదీ - 20/09/2021

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదీ - 30/11/2021

పరీక్ష తేదీ - 30/04/2022

వెబ్ సైట్లు- www.navodaya.gov.in

https://navodaya.gov.in/nvs/en/Admission-JNVSTJNVST-class/

http://cbseitms.in/nvsregn/index.aspx

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4