APTF VIZAG: Joint staff council meeting boycott by union leaders

Joint staff council meeting boycott by union leaders

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చేసిన 10 ఉద్యోగ సంఘాలు.     కమిటీలతో కాలయాపన చేస్తున్నారని ఆరోపణ.


పీఆర్‌సీ అమలు సహా ఉద్యోగుల ఇతర డిమాండ్ల అమలుపై మరోసారి జరుగుతున్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌ భేటీ నుంచి పలు ఉద్యోగ సంఘాలు బయటికొచ్చాయి. ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి బయటికి వచ్చేశారు. ఈ సమావేశంలో సీఎస్‌ కాకుండా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, ఇతర అధికారులు మాత్రమే హాజరయ్యారు. దీంతో ప్రభుత్వ వైఖరిపై ఆయా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సమావేశంలో పీఆర్‌సీ నివేదికను బహిర్గతం చేస్తామని చెప్పినప్పటికీ దానికి సంబంధించి అధికారుల నుంచి ఏ విధమైన స్పందన లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు బయటకు వచ్చారు. మొత్తం 13 ఉద్యోగ సంఘాలు సమావేశానికి హాజరు కాగా.. 9 ఉద్యోగ సంఘాలు సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాయి.


పీఆర్‌సీ నివేదిక ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్‌ ఆరోపించారు. ఇవాళ కూడా ఉద్యోగులను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మాత్రం సమావేశంలో పీఆర్‌సీ నివేదిక ఊసే ఎత్తడం లేదని అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. పీఆర్‌సీ నివేదికపై అధికారుల కమిటీ మళ్లీ అధ్యయనం చేయడం ఏమిటని ప్రశ్నించారు. సమావేశంలో తాము అడిగిన అంశాలకు స్పష్టంగా సమాధానం చెప్పలేదన్నారు. అక్టోబరు 29 నాటి భేటీలో ఇస్తామన్న నివేదిక ఇంకా వరకు ఇవ్వలేదని, కనీసం ఇవాళ్టి సమావేశంలో అయినా ఇస్తారని ఆశించామని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోకుంటే కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today