JAC ప్రెస్ మీట్ Dt13.11.21 ముఖ్యాంశాలు
1. మేనిఫెస్టోలో ఉద్యోగులకు మంచి చేస్తామని చెప్పిన ఏ హామీని కూడా ఇంతవరకు ప్రభుత్వం అమలుచేయలేదు.
2.అధికారంలోకి వచ్చిన తర్వాత సకాలంలో PRC అమలుచేస్తామని చెప్పి ఇప్పుడు కనీసం రిపోర్ట్ కూడా ఎందుకు బయటపెట్టడం లేదు..?
3.మా ఉద్యోగులు దాచుకున్న PF,APGLI సొమ్ములు తిరిగి ఎందుకు ఇవ్వడం లేదు?
4.హెల్త్ కార్డు అనారోగ్య కార్డుగా మారింది.మెడికల్ రీ యింబర్స్ మెంట్ బిల్లులు సకాలంలో ఎందుకు మంజూరు చేయరు.సంవత్సరాల తరబడి ఆలస్యం ఎందుకు అవుతోంది? 23 కోట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు?
5.CPS రద్దు,DA లు,PRC సకాలంలో ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పబట్టే మిమ్ములను నమ్మి మా ఉద్యోగులు ఓట్లు వేశారు.
6. ఈ నెలాఖరు వరకు డెడ్ లైన్...
28 వ తేదీ సమావేశం పెట్టి రాష్ట్రంలోని ఉద్యోగులు,ఉపాధ్యాయులు, పెన్షనర్లు,కార్మికులు అందరం ఉద్యమంలోకి వెళతాం!
-JAC &P JAC అమరావతి
No comments:
Post a Comment