APTF VIZAG: పీఆర్సీని వారంలోగా తేల్చాలి

పీఆర్సీని వారంలోగా తేల్చాలి

 పీఆర్సీని వారంలోగా తేల్చాలని ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి చైర్మన్లు చైర్మన్‌ బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం అమరావతి సచివాలయంలో సాధారణ పరిపాలనశాఖ సర్వీసెస్‌ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ను కలిసిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పీఆర్సీ నివేదికను సీఎంకు బ్రీప్‌ చేసి ఉద్యోగ సంఘాలకు ఇద్దామని అనుకున్నామని, అయితే సీఎం బిజీగా ఉండడం వల్ల బుధవారం ఉదయం సీఎంకు పీఆర్సీ నివేదిక బ్రీఫ్‌ చేసి, అదేరోజు మధ్యాహ్నం ఉద్యోగ సంఘాలకు అందజేస్తామని సీఎస్‌ చెప్పినట్లు శశిభూషణ్‌కుమార్‌ తెలిపారన్నారు. బొప్పరాజు మాట్లాడుతూ.. బుధవారం నివేదిక ఇవ్వని పక్షంలో ఇరు జేఏసీల రాష్ట్ర స్థాయి ఎగ్జిక్యూటివ్‌ సమావేశం ఏర్పాటు చేయదలిచామన్నారు. జీపీఎఫ్‌లోన్లు కోట్లాది రూపాయలు, ఏపీజేఎల్‌ఐ లోన్లు, విశ్రాంత ఉద్యోగుల సరెండర్‌ లీవ్‌లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి విడుదలకు కార్యాచరణ ప్రకటించాలని, లేనిపక్షంలో ఇరు జేఏసీలు తీవ్రమైన ఆందోళన బాటపట్టేందుకు సిద్ధమవుతామని వెల్లడించారు. ఇక, చంద్రశే ఖర్‌రెడ్డి ప్రభుత్వానికి సలహాదారు కానీ ఉద్యోగ సంఘాలకు కాదని, తమకు సీఎం జగనే బాధ్యత వహించాలని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా బొప్పరాజు తెలిపారు.

No comments:

Post a Comment

Featured post

Primary classes all subjects lesson plans