APTF VIZAG: చదువుల విప్లవం తెస్తున్నాం.విద్యాశాఖ మంత్రి సురేష్

చదువుల విప్లవం తెస్తున్నాం.విద్యాశాఖ మంత్రి సురేష్

రాష్ట్రంలో చదువుల విప్లవాన్ని తెస్తున్నామని రాష్ట్రవిద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. విద్యారంగంలో సంస్కరణలపై శాసనమండలిలో శుక్రవారం స్వల్ప కాలిక చర్చ జరిగింది. సభ్యులు లేవనెత్తిన పలు అంశాలపై మంత్రి సురేష్ మాట్లాడుతూ అమ్మ ఒడి వంటి అద్భుత పథకాన్ని తెచ్చి పేదపిల్లలకు సైతం కార్పొరేట్ విద్యను అందించేందుకు దోహదం చేసిన గొప్ప దార్శనికుడు సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను మూసే స్తున్నట్టు ప్రతిపక్ష టీడీపీ తప్పుడు ప్రచారం చేయ డాన్ని ఖండించారు. చంద్రబాబు హయాంలోనే ఎయిడెడ్ విద్యాసంస్థల పోస్టుల భర్తీపై బ్యాన్ పెట్టా రని, మళ్లీ రిక్రూట్మెంట్ చేపట్టి అక్రమాలకు పెద్ద ఎత్తున తెరలేపారని గుర్తుచేశారు. చంద్రబాబు తెచ్చిన ప్రైవేటు యూనివర్సిటీ యాక్ట్ ధనిక వర్గా లకే కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తెచ్చేలా ఉండటంతో.. సీఎం వైఎస్ జగన్ ఆ చట్టాన్ని సవ రించి ఆ వర్సిటీల్లో 35 శాతం సీట్లను ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల పిల్లలకు ఇవ్వాలనే సంస్కరణ తెచ్చారని చెప్పారు. లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్, ఐ.వెంకటేశ్వరరావు, కత్తి నరసిం హారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, ఇక్బాల్, కల్పలతారెడ్డి మాట్లాడారు.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today