రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని శాఖల్లోనూ కచ్చితంగా 80 శాతం హాజరు ఉండేలా చూడాలని స్పష్టం చేసింది. సచివాలయంలోని అన్ని శాఖలు రాష్ట్రవ్యాప్తంగా వాటి పరిధిలోని విభాగాలు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ రంగ, స్వతంత్ర సంస్థల్లో బయోమెట్రిక్ పరికరాల ద్వారా హాజరు నమోదు చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సాధారణ పరిపాలన శాఖ ఇటీవల జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. సచివాలయంలోని ప్రతి శాఖ పరిధిలోని వివిధ విభాగాల ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరు వివరాలను సంబంధింత శాఖ కార్యదర్శికి రోజువారీగా పంపాలని సూచించింది. అన్ని శాఖల కార్యదర్శులు బయోమెట్రిక్ హాజరును వారానికోసారి సమీక్షించాలని కోరింది.
No comments:
Post a Comment