APTF VIZAG: నేటి నుంచి ట్రిపుల్ ఐటీల ప్రవేశాలకు కౌన్సెలింగ్. నూజివీడు, ఇడుపులపాయలలో కౌన్సెలింగ్. డిసెంబర్ 2 వరకు నిర్వహణ.

నేటి నుంచి ట్రిపుల్ ఐటీల ప్రవేశాలకు కౌన్సెలింగ్. నూజివీడు, ఇడుపులపాయలలో కౌన్సెలింగ్. డిసెంబర్ 2 వరకు నిర్వహణ.

రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో పీయూసీ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఈనెల 24 నుంచి డిసెంబర్ 2 వరకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.ఆరేళ్ల సమీకృత ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్న ట్రిపుల్ ఐటీల్లో 4 వేల సీట్లతో పాటు ఈడబ్ల్యూఎస్ కోటా కింద మరో 400 సీట్లు కలిపి మొత్తం 4,400 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులకు గ్రేడ్లు ఇచ్చి ఉత్తీర్ణులుగా ప్రకటించిన నేపథ్యంలో ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి ఆర్జీయూకేటీ సెట్లు ప్రభుత్వం నిర్వహించింది.దీనిలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్కు పిలిచారు. కౌన్సెలింగ్ ఏర్పాట్లను ఆర్జీయూకేటీ ఛాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి మంగళవారం పరిశీలించారు.కౌన్సెలింగ్ ను ఉన్నత విద్య స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర ప్రారంభించనున్నట్లు తెలిపారు.నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో కౌన్సెలింగ్ కు సర్వం సిద్ధం చేశారు.ఉదయం 9 గంటలకు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏ రోజు ఏ ర్యాంకు వరకు అభ్యర్థులు హాజరవ్వాలనే వివరాలు వెబ్సైట్లో ఉంచారు.సీట్లు మిగిలితే తరువాత ర్యాంకుల వారిని పిలుస్తారు. సీటు కేటాయించిన వెంటనే అడ్మిషన్ ఫీజు, రీఫండబుల్ కాషన్ డిపాజిట్ కలిపి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు. రూ.3 వేలు, మిగిలిన కేటగిరీల విద్యార్థులు రూ.3,500 చొప్పున చెల్లించాలి.

No comments:

Post a Comment