మా సమస్యల పరిష్కారానికి మధ్యాహ్నం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ గారిని కలుస్తాం.బండి శ్రీనివాసరావు గారు వెల్లడి
ఏపి ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి, PRC తదితర అంశాలపై చర్చించేందుకు రెండు రోజుల్లో ఉన్నతాధికారులతో ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పాటు చేయబోతోంది. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉద్యోగ సంఘాల నేతలకు ఈ మేరకు హామీ ఇచ్చారు. అలాగే అతి త్వరలోనే PRC అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన సమావేశం ముగిసింది. అనంతరం నాయకులు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్జీవోల ఆధ్వర్యంలో జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు.
ఆ విషయాలు ఇలా ఉన్నాయి.
• ఉద్యోగల సమస్యలపై రెండ్రోజుల్లో ఉన్నతాధికారులతో భేటీ ఏర్పాటు చేస్తామని సజ్జల చెప్పారు.
• ఆయన సానుకూలంగానే మాట్లాడారు.
• పీఆర్సీ దసరాకు వస్తుందని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారని చెప్పాం.
• అతి త్వరలోనే పీఆర్సీ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
• ఈ రోజుకీ ఉద్యోగులకు ఇంకా పెన్షన్లు రాలేదని, జీతాలు రాలేదని చెప్పాం.
• ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకూ డబ్బలు రావడం లేదనీ వివరించాం.
• మా పై ఒత్తిళ్లు ఉన్నాయని , వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరాం.
• మా సమస్యల పరిష్కారానికి మధ్యాహ్నం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కలుస్తాం.
No comments:
Post a Comment