APTF VIZAG: మధ్యాహ్న భోజనంలో చిరుధాన్యాలు.పీఎం పోషన్ యోజనలో భాగంగా అందించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన

మధ్యాహ్న భోజనంలో చిరుధాన్యాలు.పీఎం పోషన్ యోజనలో భాగంగా అందించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన

అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసిన కేంద్రం

పిల్లల్లో పౌష్టికాహార లోపం, రక్తహీనతను అధిగమించడంపై కేంద్రం దృష్టి సారించింది. పాఠశాలల్లోని మధ్యాహ్న భోజనంలో చిరుధాన్యాల ఆహార పదార్థాలను అందించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని యోచిస్తోంది. సజ్జ, జొన్న, రాగి వంటి చిరుధాన్యాల్లో పోషకాలు పుష్కలంగా ఉండడంతో వాటితో చేసిన పదార్థాలను అందించడంపై దృష్టి పెట్టింది. వీటిని పీఎం పోషన్ యోజనలో భాగంగా చేసి పిల్లలకు అందించాలని కోరుతూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది.

No comments:

Post a Comment